హైదరాబాద్ బేగంబజార్లో ఘోరం.. భార్య గొంతు కోసి.. కొడుకు గొంతు నులిమి..

హైదరాబాద్: బేగంబజార్ పోలీస్టేషన్ పరిధిలోని తొప్ ఖానాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో తల్లీ, కొడుకులను అతి క్రూరంగా చంపాడు ఓ కసాయి భర్త. శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన సిరాజ్ అనే వ్యక్తి కుటుంబంతో బేగంబజార్ లో నివాసం ఉంటున్నాడు.  బేగం బజార్ లోని స్థానిక బ్యాంగిల్ షాపులో పనిచేసే సిరాజ్, అదే ఏరియాలో రెండు రోజుల క్రితం ఇల్లును కిరాయికి తీసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు భార్య, చిన్న కొడుకును చంపినట్లు తెలుస్తోంది. భార్య హేలియా(35)పై అనుమానంతో రాత్రంతా గొడవ పడి చివరికి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అదేవిధంగా చిన్న కొడుకు హైజాన్ ను గొంతు నులిమి చంపేశాడు. పెద్ద కొడుకు అమెజాన్ (4) ను చంపకుండా వదిలేశాడు. 

Also Read :- ఆన్లైన్లో విషం ఆర్డర్ చేసి తాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

పెద్ద కొడుకు లేచి చూసేసరికి తల్లి, తమ్ముడు చనిపోయి ఉండటంతో.. పై అంతస్తులో నివాసం ఉండే వ్యక్తులకు సమాచారం అందించాడు. దీంతో 100కు డయల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సిరాజ్ సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హిందీలో ఉన్న సూసైడ్ నోట్ లో తల్లీదండ్రులను క్షమాణ కోరుతున్నట్లు, అదే విధంగా మృతదేహాలను ఉత్తర ప్రదేశ్ లోని తమ స్వగ్రామానికి తరలించాలని రాసినట్లు పోలీసులు తెలిపారు. సిరాజ్ బతుకుదెరువు కోసం 6 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చినట్లు అబిడ్స్ ఎసీపీ చంద్రశేఖర్ తెలిపారు. రెండేళ్లకోసారి యూపీ వెళ్లి వచ్చే సిరాజ్, లాస్ట్ టైమ్ వెళ్లినపుడు 15 రోజులు అక్కడే ఉన్నాడు. భార్యపై అనుమానంతో  శుక్రవారం భార్య కొడుకును చంపి చివరికి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.