కొల్చారం, వెలుగు: బట్టలు ఆరేస్తుండగా కరెంట్‌షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. కొల్చారం మండలం సంగాయిపేట తండాకు చెందిన గుగులోతుదేవి(28) శుక్రవారం ఉదయం ఉతికిన బట్టలు ఇంటి ముందున్న తీగపై ఆరేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో కిందపడిపోయింది. ఆమెను కుటుంబసభ్యులు వెంటనే మెదక్ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయిందని తెలిపారు. కోతులు విద్యుత్సర్వీసు వైరును పాడు చేయడంతో అది బట్టలు ఆరేసే తీగపై పడి ఉండడంతో షాక్కొట్టినట్టు బాధిత కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహ్మద్‌గౌస్ తెలిపారు.