నేనుంటే టీమిండియా గెలిచేది కాదు..

నేనుంటే టీమిండియా గెలిచేది కాదు..

భారత క్రికెట్ జట్టు చరిత్రలో 2011 వరల్డ్ కప్ ఒక మైలురాయి.  28 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచ్ కప్ను దక్కించుకుంది. ధోని సారథ్యంలోని భారత జట్టు..ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయం సాధించి..విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ వరల్డ్ కప్లో భారత్ జట్టు..సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆసీస్, పాకిస్తాన్ లాంటి మేటి జట్లను ఓడించి ఫైనల్ చేరింది. అయితే ఈ టోర్నీలో  ఎన్ని జట్లపై ధోనిసేన గెలిచినా..చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై గెలవడం ప్రత్యేకం. మొదట బ్యాటింగ్ చేసిన భారత్..సచిన్ సూపర్ హాఫ్ సెంచరీతో 50 ఓవర్లలో  260 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ టీమిండియా బౌలర్ల ధాటికి 49.5 ఓవర్లలో కేవలం 231 పరుగులకే కుప్పకూలింది. 


  
 నేనుంటే గెలిచేది కాదు..
2011 వరల్డ్ కప్లో భారత్ పాక్ మ్యాచ్పై మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చెత్త వ్యాఖ్యలు చేశాడు. సెమీ ఫైనల్లో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో తాను ఆడితే..భారత్ ఖచ్చితంగా ఓడిపోయేదన్నాడు. సెమీస్లో భారత్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసేవాడినని చెప్పుకొచ్చాడు.  ఆ మ్యాచ్ ఓటమి  జ్ఞాపకాలు  ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయన్నాడు. సెమీస్లో ఆడాలనుకున్నప్పటికీ..ఫిట్గా లేని కారణంగా టీమ్ మేనేజ్మెంట్ తనను పక్కనపెట్టిందని అక్తర్ చెప్పాడు. 

 సచిన్, సెహ్వాగ్ను త్వరగా ఔట్ చేసేవాడిని..
తాము ఎన్నో ఆశలతో వరల్డ్ కప్లో అడుగు పెట్టామని..అనుకున్నట్లుగానే సెమీస్ వరకు వచ్చామన్నాడు షోయబ్ అక్తర్. అయితే కీలక మ్యాచ్లో ఓడిపోవడం ఇప్పటికీ బాధిస్తుందని చెప్పాడు. భారత్ చేతిలో ఓడిపోతుంటే..తాను డగౌట్లో కూర్చోని చూస్తూ ఉండలేకపోయానన్నాడు. ఓటమిని తట్టుకోలేక తాను వస్తువులను పగులకొట్టానని చెప్పుకొచ్చాడు. అటు ఆ మ్యాచ్లో తాను ఆడితే మాత్రం సచిన్ను హాఫ్ సెంచరీ చేయనిచ్చే వాడిని కాదన్నాడు. సెహ్వాన్ను త్వరగానే ఔట్ చేసేవాడనని అక్తర్ తెలిపాడు. అయితే భారత్తో మ్యాచ్ అంటే ఎప్పటికీ ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందన్నాడు. 2011 వరల్డ్ కప్లో భారత జట్టు ఒత్తిడిని జయించి విజేతగా నిలిచిందన్నాడు. 

 

మరిన్ని వార్తలు