సంజయ్ రౌత్​పై పార్టీ కార్యకర్తల దాడి!

ముంబై: శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్​పై సొంత పార్టీ కార్యకర్త లే దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం ఉద్ధవ్‌‌‌‌ థాక్రే నివాసం మాతోశ్రీలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో థాక్రే మద్దతుదారులు, సంజయ్‌‌‌‌ రౌత్‌‌‌‌ల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఆయనను కొన్ని గంటల పాటు గదిలో బంధించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

 ఈ సమావేశంలో భాగంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ.. సంజయ్ వైఖరి, మాటలతో ఇటీవలి ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. దీంతో ఆయనకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు సంజయ్ రౌత్ పై దాడికి పాల్పడి గదిలో బంధించారని ప్రచారం జరుగుతోంది.