షిండేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు

షిండేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Political Crisis In Maharashtra)పై శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎదురు తిరిగిన ఏక్ నాథ్ షిండే (Eknath Shinde)పై విమర్శలు గుప్పిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. రాజకీయ సంక్షోభానికి కారణమైన షిండేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నాసిక్ లో షిండేకు మద్దతుగా ఏర్పాటు చేసిన పోస్టర్ పై ఇంకు చల్లారు. అంతటితో ఆగకుండా గుడ్లను విసిరారు. ఔరంగాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. తమ మద్దతు థాక్రేకు అంటూ వెల్లడించారు. ఓటర్ల నమ్మకాన్ని అమ్ముకొనే మోసగాళ్లుగా రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అలాగే మహిమ్ నియోజకవర్గం ఎమ్మెల్యే సదా సర్వాంకర్ పోస్టర్ పై సిరా పూశారు. మోసగాడంటూ.. పోస్టర్ పై రాశారు. ప్రస్తుతం షిండే, రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలోని ఓ హోటల్ లో మకాం వేశారు. వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శివసేన కార్యకర్తలు. షిండేకు మద్దతిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో షిండేకు 39 మంది మద్దతు పలికారు. మరోవైపు సీఎం ఉద్ధవ్ ముఖ్యనేతలతో జరిపిన కీలక సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. తాను సీఎం, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించినట్లు సమాచారం. తనకు పూర్తిస్థాయి మెజార్టీ ఉందని చెప్తున్నారు ఏక్ నాథ్.