బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ప్రధాని మోదీకి లేఖ రాశారు. మోదీగారు మీరు చాలా గ్రేట్ అంటూ..... అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మోదీ చేసిన కృషిని ప్రశంశిస్తూ.. కృతఙ్ఞతను లేఖ ద్వారా తెలిపారు. హిందువుల ఐకానిక్ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి.. బాలక్ రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి లక్షలాది మంది ప్రజల కలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషిచేశారని నటి శిల్పాశెట్టి తెలిపారు. మీరు ( ప్రధాని మోది) 500 ఏళ్ల రామజన్మభూమి చరిత్రను తిరగరాసినందుకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు.. ఇంతటి మహత్కర శుభకార్యాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు అని హిందీలో రాసిన లేఖలో పేర్కొన్నారు.
#धन्यवाद_मोदीजी
— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) February 12, 2024
सुप्रसिध्द अभिनेत्री @TheShilpaShetty जी यांनी नुकताच पंतप्रधान नरेंद्र मोदीजींना पत्र लिहून त्यांचे आभार मानले.
५ शतकांपासून श्रीरामांना वनवास घडत होता. अखेर तो वनवास संपला. तेही मोदीजींच्या प्रयत्नांमुळे.. यासाठीच शिल्पाजींनी पंतप्रधानांचे आभार मानले आहेत.… pic.twitter.com/LTqpjGolLK
అయోధ్యలో రామ మందిరం కలను సాకారం చేసిన ప్రధాని మోదీకి namo@bjpcc.org అనే ఇమెయిల్ ఐడి ద్వారా ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను కూడా మెయిల్ చేయవచ్చని తెలిపారు. మహారాష్ట్ర బీజేపీ సోషల్ మీడియాలో ఈ లేఖ వైరల్ అవుతుంది. మరాఠీలో ప్రముఖ నటి @TheShilpaShetty ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ధన్యవాదాలు తెలిపారు. శ్రీరాముడు 5 శతాబ్దాలు వనవాసం చేశారంటూ... చివరకు మోదీజీ కృషి వల్ల ఆ వనవాసం ముగిసిందని ఇందుకు శిల్పాశెట్టి కృతఙ్ఞతలు తెలిపారు. జనవరి 22న బాలక్ రాముడి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖేష్ అంబానీ , నీతా అంబానీ, అమితాబ్ బచ్చన్, అలియా భట్ , రణబీర్ కపూర్ , కంగనా రనౌత్ , మాధురీ దీక్షిత్ , రోహిత్ శెట్టి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.