షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుండి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం ఉన్నపటికీ ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కడప ఎంపీ టికెట్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో షర్మిల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు షర్మిల. కడప జిల్లా వ్యాప్తంగా 8రోజుల పాటు షర్మిల బస్సు యాత్ర సాగనుంది. ఈ మేరకు షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 

కడప జిల్లాలోని అన్ని మండలాల ప్రజలతో కలిసే విధంగా ఈ షెడ్యూల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. 5వ కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి. కోడూరు, గోపవరంలో బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది షర్మిల. ఆ తర్వాత 6వ తేదీన బద్వేల్, అట్లూరు, కడపలో బస్సు యాత్ర సాగనుంది .7వ తేదీ దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు, బి. మఠం, 8వ తేదీ కమలాపురం, వల్లూరు చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయిని పల్లిలో షర్మిల ప్రచార యాత్ర సాగుతుంది. 

ALSO READ :-Adhurs 2: అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంటేసి నిరాహార దీక్ష చేస్తా : కోన వెంకట్

ఆ తర్వాత 10వ తేదీ చక్రాయపేట, వేంపల్లి, వేముల, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల,11వ తేదీన తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరం మీదుగా 12వ తేదీన జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు రాజుపాలెం చేరుకొని షర్మిల కడప జిల్లా బస్సు యాత్ర ముగియనుంది. కాగా, ఇప్పటికే జగన్ మీద ఘాటైన విమర్శలు గుప్పిస్తున్న షర్మిల ఈ ప్రచారంలో భాగంగా ఏ రేంజ్ లో విమర్శల దాడి చేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.