జగన్ ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు... షర్మిల నవసందేహాలు...

జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఎంపీగా కడప బరిలో దిగిన షర్మిల జగన్, అవినాష్ రెడ్డిలపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కుంటున్న సమస్యలతో పాటు వివిధ అంశాల పట్ల విమర్శలతోనవసందేహాలు అంటూ బహిరంగ లేఖ రాసిన షర్మిల తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై నవసందేహాలతో జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఉద్యోగుల సమస్యలపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన షర్మిల ఈ ,మేరకు వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం చేశాడని అన్నారు. వైఎస్ఆర్ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తే, జగన్ మాత్రం ద్రోహం చేశాడని మండిపడ్డారు. ఉద్యోగుల పట్ల జగన్ సర్కార్ తీరు చాలా బాధాకరంగా ఉందని అన్నారు. గౌరవంగా బతకాల్సిన వారిని అవమానిస్తున్నారని, బొత్స లాంటి వాళ్ళు కాళ్ళు పట్టుకొని అడగాలని అంటున్నారని అన్నారు. ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారని, వారి హక్కులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలని గొప్పలు చెప్పుకుంటున్నారు, ఉద్యోగుల విషయంలో మేము అడిగే నవసందేహాలకు సమాధానం చెప్పండని అన్నారు షర్మిల.

ఉద్యోగుల విషయంలో షర్మిల నవసందేహాలు:

  • అధికారంలో వచ్చాక వారం రోజుల్లో  CPS విధానం రద్దు చేసి... GPS విధానం అమలు చేస్తామని చెప్పారు..ఎందుకు చేయలేదు ? GPS అవసరం లేదు...మాకు కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తెచ్చిన OPS విధానం అమలు చేయాలి అంటున్నా ఎందుకు  వినడం లేదు ?
  • ఒకటో తారీకు న జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు...ప్రతి నెల 15 నుంచి 25 మధ్యలో జీతాలు అందుకోవడం ఎంటి ? ఇది అసమర్థ పాలనకు నిదర్శనం కాదా ?
  • 11 వ PRC కమీషన్ లో..మీరు ప్రకటన చేసిన IR కంటే ( 27శాతం )  తక్కువ ఫిట్ మెంట్ (23శాతం )  ఇచ్చిన ఘనత మీది కాదా ? 
  • 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12 వ PRC  ఇంకా ఎందుకు అమలు చేయలేదు...కేవలం కమీషన్ వేశారు... కాలయాపన చేస్తున్నారు.
  • నివేదిక వచ్చే వరకు కొత్త IR ఇస్తామని చెప్పారు..ఏమయ్యింది ? 
  • HRA రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు...
  • జిల్లా స్థాయిలో పని చేసే ఉద్యోగులకు HRA 20 శాతం నుంచి 16 శాతానికి ఎందుకు తగ్గించారు. ? 
  • ఉద్యోగులకు చెల్లించాల్సిన 22 వేల కోట్ల పాత బకాయిలు సంగతి ఏంటి ?
  • 2022 నుంచి ఇవ్వాల్సిన TA,DA లు 270 కోట్లు 2027 లో చెల్లిస్తాం అని చెప్పడం ఏంటి ?
  • ఉద్యోగులు సరెండర్ చేసిన లీవులు బకాయిలు 2500 కోట్లు...ఎప్పుడు చెల్లిస్తారు..?
  • ఉద్యోగులకు మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ బిల్లులు 118 కోట్లు పెండింగ్ ఉన్నాయి...వీటి సంగతి ఎంటి

ఉద్యోగులకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, వైఎస్ఆర్ చేసుకున్నట్లు ఉద్యోగులను భద్రంగా చూసుకుంటామని అన్నారు షర్మిల. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత OPS విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.