టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన పట్టుదలను చూపించాడు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ గ్రౌండ్ లో తమ జట్టు కోసం అసాధారణంగా పోరాడాడు. ఇరానీ కప్ లో భాగంగా ముంబై ప్లేయర్ శార్దూల్ రెండో రోజు బ్యాటింగ్ చేయడానికి 10 నెంబర్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగాల్సిన ఈ ఆల్ రౌండర్ 10 వ స్థానంలో బ్యాటింగ్ రావడంపై ఆశ్చర్యం నెలకొంది. అయితే అతను చివర్లో బ్యాటింగ్ కు రావడానికి జ్వరం కారణమట.
రెండో రోజు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ.. ఠాకూర్‌ను బుధవారం (అక్టోబర్ 2) జట్టు కోసం బ్యాటింగ్ చేశాడు. అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 102 డిగ్రీల జ్వరంతో ఇబ్బందిపడుతున్నట్టు తెలిసింది. అయినప్పటికీ సర్ఫరాజ్ తో కీలకమైన 10 వికెట్ కు కీలకమైన 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 59 బంతుల్లో 36 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా సర్ఫరాజ్ డబుల్ సెంచరీ చేయడానికి సహకరించాడు.
Also Read:-నేటి నుంచి విమెన్స్ టీ20 వరల్డ్ కప్..
బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరాడు. గురువారం ఉదయం మ్యాచ్ ప్రారంభం కాగా.. శార్దూల్ ఈ మ్యాచ్ లో కనిపించలేదు. నివేదికల ప్రకారం ఠాకూర్ పెద్ద ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. నాలుగో రోజు అతను బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఈ ఫాస్ట్ బౌలర్ లేకపోవడంతో ముంబై నాలుగు బౌలర్లతోనే ఆడుతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సర్ఫరాజ్ (222) డబుల్ సెంచరీతో ముంబై తొలి ఇన్నింగ్స్ లో 539 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన రెస్టాఫ్ ఇండియా ప్రస్తుతం వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది.
Shardul Thakur the warrior in display ??#IraniCup #WhistlePodu #ShardulThakur @imShard pic.twitter.com/EFcjgWwItW
— WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) October 3, 2024