Astrology:   పూర్వాభాద్ర నక్షత్రంలోకి శని ప్రవేశం.. మూడు రాశుల వారి దశ తిరుగుతుంది.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శనిదేవుడు కర్మ, న్యాయాలకు ప్రతీకగా ఉంటాడు. ఒకటిన్నర సంవత్సరానికి ఒక రాశి నుంచి మరొక రాశికి శని సంచారం జరుగుతుంది. కానీ.. ఈ ఏడాది శని సంచారం చాలా త్వరగా మారుతోంది.  పంచాంగం ప్రకారం  ఆదివారం ( ఆగస్టు 18)  రాత్రి 10:30 గంటలకు శని భగవానుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి మారాడు.  ఈ ప్రభావం అన్ని రాశులపై పడనుంది. కానీ.. ప్రత్యేకంగా 3 రాశులవారికి అదృష్టం కలిసి రాబోతోంది.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం పూర్వ భాద్రపదలోకి శని సంచారంతో  వృషభరాశి, మిథున రాశి, కుంభ రాశి వారి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు.  మిగతా రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. . . 

మేష రాశి : శనిదేవుడు  .. పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించడంతో   పనుల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలుండటంతోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కెరీర్ పరంగా మంచిస్థాయికి చేరుకుంటాయి. కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు. 

వృషభ రాశి : శని పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించడం.. ఈ రాశివారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. నిపుణులు, వ్యాపారవేత్తలు.. తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదిస్తారు. ఉద్యోగులు ఉద్యోగం మారేందుకు ఇదే మంచి సమయం. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ ప్రదేశంలో మీ ప్రతిష్టలు పెరుగుతాయి. తండ్రితో అనుబంధం బలపడుతుంది.

మిథున రాశి : శని నక్షత్ర మార్పు ఈ రాశివారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. శని ఈ రాశివారి గోచర కుండలిలోని 9వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అదృష్టం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు డీల్ జరగవచ్చు. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి: ఈరాశి వారికి శని సంచార ప్రభావం ఇప్పటికే ఉంది. శని భగవానుడు నక్షత్రం మారాడు  కాబట్టి ఈ రాశి వారు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చర్య జాగ్రత్తగా చేయాలి. కుటుంబ జీవితం మరియు వైవాహిక జీవిత సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడవచ్చు. మొత్తంమీద, మీరు లాభం మరియు నష్టం రెండింటినీ ఎదుర్కొంటారు.

సింహరాశి: సింహరాశికి శని సంచారం త్వరలో వ్యాపారంలో మంచి పురోగతిని తెస్తుంది. కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తారు. మీరు కొత్త ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయాలనుకుంటే, ఈ కాలం దానికి అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. కొత్తగా పెళ్లయిన వారికి సంతాన భాగ్యం కలుగుతుంది.

కన్యా రాశి: శని భగవానుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి మార్పు వల్ల ప్రయోజనం పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధించవచ్చు. వ్యాపారస్తులకు శుభవార్తలు అందుతాయి. గతంలో రాకుండా నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. అలాగే ఈ సమయంలో మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించినా, పెట్టుబడి పెట్టినా మంచి ఫలితాలను పొందుతారు. దాంతో మీ ఆర్థిక స్థితి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అదే సమయంలో, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

 తులారాశి: ఈ రాశి  వారికి శని పూర్వ భాద్ర నక్షత్రంలో సంచారం వల్ల ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. వారు వ్యాపార మరియు సంస్థలలో పురోగతిని పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురుకావచ్చు. వివాహితులు జాగ్రత్తగా ఉండాలి. జంటల మధ్య అపార్థాలు మరియు అనవసరమైన వాదనలు మీ ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

 వృశ్చికరాశి: పూర్వ భాద్ర నక్షత్రం యొక్క మొదటి ఇంట్లో శని సంచారం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన మీ పనులు ఊపందుకుంటాయి. సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. తల్లి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని శుభవార్తలు రావచ్చు. అదే సమయంలో, ఈ కాలం నిపుణులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

 ధనస్సు రాశి: ఈ రాశి వారు  గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వీరికి మంచి లాభాలు 19వ తేదీ తర్వాత అందుతాయి. అదనపు ఆదాయ మార్గాలు కూడా తోడవుతాయి. ఇప్పటివరకు వేధిస్తున్న కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. శనిదేవుడి  అనుగ్రహం వల్ల ఆర్థికంగా మంచిరోజులు వస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మంచి ఫలితాలు కలగడంతోపాటు సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించని ఆనందాన్ని అనుభవిస్తారు.

 మకర రాశి: ఈ రాశి వారికి శని నక్షత్రం సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీ సంపద స్థానంలో శనిదేవుడు ఉంటాడు. ఫలితంగా ఆర్థిక పరిస్థితి మరింత పటిష్టంగా ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ బాగా పెరుగుతుంది.  మకర రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు లభిస్తాయి. మీరు మీ ప్రవర్తన, ప్రసంగం మరియు నైపుణ్యాలతో ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రాశి జాతకులు కొత్త వాహనం లేదా కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు

 కుంభరాశి:  శని నక్షత్ర మార్పు ఈ రాశివారికి లాభాలను ఇస్తుంది. జన్మలగ్నంలోకి శని రానుండటం శష రాజయోగాన్ని ఇస్తుంది. పరపతి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఏ పనినైనా సులభంగా పూర్తి చేస్తారు. పార్టర్న్ షిప్ వ్యాపారం చేసేందుకు మంచికాలం. వివాహితులకు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి వివాహం జరగవచ్చు.

 మీన రాశి: శనిదేవుడు పూర్వాభాద్ర నక్షత్రంలో  సంచారం కొన్ని చెడు ఫలితాలను తెస్తుంది. దీంతో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కష్టమవుతోంది. ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. చాలా ఖర్చులు ఉంటాయి. అయితే వ్యాపారులకు మంచి లాభం ఉంటుంది. అయితే కొత్త వ్యాపారాలు చేపట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి నష్టానికి దారితీస్తాయి.