కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ టెస్టు కెప్టెన్, ఓపెనర్ షాన్ మసూద్ ఆల్ టైమ్ పాకిస్థాన్ రికార్డు బద్దలు కొట్టాడు. ఫాలో-ఆన్‌లో 251 బంతుల్లో 145 పరుగులు చేసిన మసూద్.. జట్టును భారీ ఓటమి నుండి గట్టెక్కించాడు. తద్వారా టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన పాకిస్తానీ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ALSO READ | Team India: బుమ్రాను చెరకు రసం పిండినట్లు పిండారు: మాజీ స్పిన్నర్
అంతేకాదు, దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి పాక్ కెప్టెన్.. షాన్ మసూద్. తొలి ఇన్నింగ్స్‌లోపాక్ 194 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. ఫాలో-ఆన్‌లో బాబర్ అజాం(81)- షాన్ మసూద్ జోడి వికెట్ పడకుండా 205 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం.
దక్షిణాఫ్రికాలో పాక్ ఆటగాడి అత్యధిక టెస్టు స్కోరు
- 1. షాన్ మసూద్: లో దక్షిణాఫ్రికాలో 145 (2025)
- 2. అజర్ మహమూద్: 136 (1998)
- 3. తౌఫీక్ ఉమర్: 135 (2003)
- 4. సయీద్ అన్వర్: 118 (1998)
- 5. అసద్ షఫీక్: 111 (2013)
సచిన్ చారిత్రాత్మక ఫీట్
145 పరుగులు చేసిన మసూద్.. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ సఫారీ గడ్డపై నెలకొల్పిన చారిత్రాత్మక ఫీట్‌ను చేజార్చుకున్నాడు. భారత మాజీ బ్యాటర్ 169 పరుగులతో దక్షిణాఫ్రికాలో అత్యధిక స్కోరు చేసిన ఆసియా కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. ఆ రికార్డు పదిలంగా ఉంది. ఈ జాబితాలో 153 పరుగులతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నారు.
దక్షిణాఫ్రికాలో ఆసియా కెప్టెన్ల అత్యధిక స్కోర్లు
1. సచిన్ టెండూల్కర్: 169 (1997)
2. విరాట్ కోహ్లీ: 153 (2018)
3. షాన్ మసూద్: 145 (2025)
4. దిముత్ కరుణరత్నే: 103 (2021)
5. సలీమ్ మాలిక్: 99 (1995)