శంషాబాద్, వెలుగు : కల్తీ సాస్ తయారీ కేంద్రంలో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం సాతంరాయి సింప్లెక్స్ వద్ద రాజేష్(32), శ్రీరామ్ తివారీ(31) అనే ఇద్దరు బాలాజీ ఇండస్ట్రియల్ పేరుతో సాస్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నాసిరకం
గడువు ముగిసిన ఆహార పదార్థాలు, సింథటిక్ కలర్స్, కెమికల్స్‌తో చిల్లీ, టమాటా సాస్, టర్మరిక్ పౌడర్ తయారు చేస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. వినియోగిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం దాడిచేసి 5 లీటర్ల సింథటిక్ కలర్స్, 35 కిలోల పసుపు, చిల్లీ సాస్ 1.5 కిలోలు, 450 లీటర్ల టమాటా సాస్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
