బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అతని బౌలింగ్ శైలి ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో.. బౌలింగ్ చేయకుండా ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)బంగ్లా ఆల్ రౌండర్‌పై నిషేధం విధించింది.
షకీబ్ ఈ నెల ప్రారంభంలో లాఫ్‌బరో విశ్వవిద్యాలయంలో బౌలింగ్ పరీక్షను ఎదుర్కొన్నాడు. ఆ టెస్టులో అతని బౌలింగ్ యాక్షన్‌లో మోచేయి పొడిగింపు మించిపోయినట్లు నిర్ధారించారు. నిబంధనల ప్రకారం, మోచేతి పొడిగింపు 15 డిగ్రీల థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉండాలి. కానీ, షకీబ్ ఆ పరిధిని మించిపోతున్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలోనే ఈసీబీ ససెన్షన్ వేటు వేసింది. ఈ నిషేధం డిసెంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఈసీబీ అధికారులు వెల్లడించారు.
? Shakib Al Hasan’s action was reported by the standing umpires while he was playing for Surrey in the County Championship; he's ineligible to bowl in ECB competitions until he has passed an independent re-assessment of his bowling action pic.twitter.com/C8AX53pigg
— ESPNcricinfo (@ESPNcricinfo) December 13, 2024
షకీబ్‌పై పడిన సస్పెన్షన్ రద్దు కావాలంటే.. ఈ ఆల్‌రౌండర్ ఐసీసీ పర్యవేక్షణలో బౌలింగ్ టెస్టును ఎదుర్కోవాలి. అందులో తన యాక్షన్ సరైనదని నిరూపించుకోవాలి. ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే తరఫున బరిలోకి దిగిన షకీబ్.. సోమర్‌సెట్‌తో జరిగిన పోరులో 9 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం అతని బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు.
ALSO READ | Jasprit Bumrah: బుమ్రా నా మాట విను.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించు: షోయబ్ అక్తర్