హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో రంజీ మ్యాచ్‌.. ఆంధ్ర ‌‌‌‌‌‌‌బ్యాటర్‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ సెంచరీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కెప్టెన్ షేక్‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌ (203) డబుల్ సెంచరీ, కిరణ్‌‌‌‌‌‌‌‌ షిండే (109) సెంచరీతో రాణించడంతో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం దక్కించుకుంది. 

ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరు168/3 తో ఆట కొనసాగించిన ఆంధ్ర మూడో రోజు, శుక్రవారం  చివరకు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 448/9 స్కోరు చేసింది. రషీద్‌‌‌‌‌‌‌‌, కిరణ్‌‌‌‌‌‌‌‌ నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 236 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించారు. భరత్‌‌‌‌‌‌‌‌ (33) ఫర్వాలేదనిపించగా..  విహారి (0), విజయ్‌‌‌‌‌‌‌‌ (12) ఫెయిలయ్యారు. సందీప్‌‌‌‌‌‌‌‌ (33 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), లలిత్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. అనికేత్‌‌‌‌‌‌‌‌ 4 వికెట్లు పడగొట్టాడు.  ప్రస్తుతం ఆంధ్ర 147 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది.