షాన్ బాగ్ షూటర్.. బీజేపీలో చేరిన కపిల్ గుర్జార్

షాన్ బాగ్ షూటర్.. బీజేపీలో చేరిన కపిల్ గుర్జార్
షహీన్‌బాగ్ కాల్పులతో కలకలం సృష్టించిన కపిల్ గుర్జార్ బీజేపీలో చేరారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో పెద్ద ఎత్తున నిరవధిక నిరసన జరిగింది. మహిళలు నేతృత్వం వహించిన ఈ నిరసనలో ఢిల్లీ షహీన్ బాగ్ వద్ద కపిల్ గుర్జార్ తుపాకీతో గాలిలో కాల్పులు జరిపాడు. షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేకుల కారణంగా ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయిందని ఆ నిరాశతోనే కాల్పులు జరిపినట్లు చెప్పుకొచ్చాడు. ఇంట్లో తన సోదరి వివాహం పెట్టుకున్నారని, అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా పెళ్లి పనులు చేసుకోలేకపోయామని, ఆ నిరాశతోనే నిరసన చేస్తున్న ప్రదేశంలో కాల్పులు జరిపినట్లు ఢిల్లీ పోలీసుల విచారణలో గుర్జార్ చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణ అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. అయితే తాజాగా గుర్జార్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గుర్జార్ మాట్లాడుతూ నేను బీజేపీలో చేరడానికి ఇంతకు ముందే సిద్ధమయ్యాను. బీజేపీనే ఎంచుకోవడానికి కారణం, ఆ పార్టీ  దేశాభివృద్దికి కృషి చేస్తుందన్నాడు.