ICC ODI rankings: ఆస్ట్రేలియాపై విధ్వంసం.. వరల్డ్ నెం.1 బౌలర్‌గా పాకిస్థాన్ పేసర్

పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది గాడిలో పడ్డాడు. ఏడాది కాలంగా విఫమవుతున్న ఈ పాక్ పేసర్.. తన పాత ఫామ్ ను అందుకున్నాడు. ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో అదరగొట్టి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ ను వెనక్కి నెట్టి అఫ్రిది టాప్ లోకి దూసుకెళ్లాడు. ఆసీస్ తో సిరీస్ కు ముందు నాలుగో స్థానంలో ఉన్న అఫ్రిది.. మూడు స్థానాలు ఎగబాకడం విశేషం. 

ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో అఫ్రిది 8 వికెట్లు పడగొట్టాడు. అతని సగటు 12.62 కాగా.. ఎకానమీ కేవలం 3.76 గా ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌ సమయంలో అఫ్రిది నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్, కేశవ్ మహరాజ్ వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో ఉండగా.. బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సిరాజ్ 8 వ స్థానంలో నిలిచాడు.       

ALSO READ | IND vs SA 3rd T20I: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా తుది జట్టులో RCB బౌలర్‌

వన్డే బ్యాటింగ్ విషయానికి వస్తే పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. టీమ్స్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే భారత్ అగ్ర స్థానంలో ఉంది.  ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన పాకిస్థాన్ మూడు స్థానంలో ఉండగా.. ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది.