Shaheen Afridi: పాక్ క్రికెటర్ల మధ్య వివాదం.. బాబర్‌ను ఎగతాళి చేసిన అఫ్రిది

ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగులు చేసినప్పటికీ ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక సంఘటన సంచలనంగా మారింది. పాకిస్థాన్ పేస్ స్పీడ్ స్టార్ షాహీన్ షా అఫ్రిది తన మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను ఎగతాళి చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా తెగ వైరల్ అవుతుంది.

బాబర్‌ను తిట్టేందుకు అఫ్రిదీ "జింబు" అనే పదాన్ని వాడినట్లు సోషల్ మీడియాలో కనిపించిన వీడియోలో స్పష్టంగా అర్ధమవుతుంది. వీడియోలో ఆడియో వినిపించినప్పటికీ బాబర్ ను వెక్కిరిస్తున్నాడని అభిమానులు త్వరగానే గ్రహించారు. జింబాబ్వేపై బాబర్ ఆజామ్ సెంచరీల మీద చేస్తాడు. కానీ పెద్ద జట్లపై ఆడలేడనే విమర్శ ఉంది. దీంతో అతన్ని గతంలో జింబు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. తాజాగా ఈ పదాన్ని అఫ్రిది వాడడం షాకింగ్ కు గురి చేసింది. ఇంగ్లాండ్ తో తాజాగా ముగిసిన ఈ టెస్టులో బాబర్ తొలి ఇన్నింగ్స్ లో 30.. రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేశాడు.  

Also Read:-గైక్వాడ్‌కు బ్యాడ్ లక్.. రోహిత్ స్థానంలో అతడికే చోటు       

ఆసియా కప్ 2023 లో భాగంగా శ్రీలంకతో ఓటమి అనంతరం ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్.. డ్రెస్సింగ్ రూమ్‍లో ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్నాడు. ఈ మీటింగ్ లో  జట్టు ప్రదర్శనపై తన నిరాశను వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అతనికి, షాహీన్ షా అఫ్రిదికి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మస్పర్దలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.