Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు

షాబాజ్ అహ్మద్.. అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ ఈ బెంగాల్ ఆల్ రౌండర్ ను ఏ ఒక్క ఫ్రాంచైజీ పట్టించుకోడు. 2024 ఐపీఎల్ మినీ వేలానికి ముందు షాబాజ్ ను ఆర్సీబీ రిలీజ్ చేసింది. అంతకముందు బెంగళూరు జట్టుకు బాగా ఆడినా ఇతడిని పక్కన పెట్టారు. ఇటీవలే ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు సన్ రైజర్స్ షాబాజ్ ను రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. అయితే ఎవరు తనకు పక్కన పెట్టినా ఈ పంజాబ్ ఆల్ రౌండర్ సూపర్ ఫామ్ లోనే  ఉంటాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ చేసి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. 

Also Read :- మరికొన్ని గంటల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్

శనివారం (నవంబర్ 23) రాజ్‌కోట్‌ వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో షాబాజ్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో సెంచరీ చేసి ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు. అతని ఇన్నింగ్స్ లో ఏడు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో బెంగాల్ బౌలర్లు విజృంభించారు. 10 పరుగులకే నాలుగు వికెట్లు తీసి పంజాబ్ ను కష్టాల్లోకి నెట్టారు. ఈ దశలో  మయాంక్ మార్కండే (43) తో కలిసి షాబాజ్ ఊహించని విజయాన్ని అందించాడు. 

షాబాజ్ అహ్మద్ మెరుపు ఇన్నింగ్స్ తో పంజాబ్ 4 వికెట్ల తేడాతో బెంగాల్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగాల్ 19.4 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ మరో ఓవర్ మిగిలించి ఛేజ్ చేసింది. ఐపీఎల్ మెగా ఆక్షన్ ముందు షాబాజ్ సెంచరీ చేయడంతో అతడికి వేలంలో భారీ ధర పలికే అవకాశముంది.