వెలమల దూషణ వివాదం.. ఐ యామ్ ​సారీ:ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

  • నా మాటలను వెనక్కి తీసుకుంటున్న
  • వెలమ వివాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్లారిటీ

షాద్ నగర్: వెలమలను దూషించారన్న వివాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు. తన మాటలు వెలమ జాతికి సంబంధించినవిగా భావిస్తే తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు. 

స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంకర్ మాట్లాడుతూ తాను మాట్లాడిన వ్యాఖ్యలను వెనక ముందు కత్తిరించి కొన్ని మాటలను మాత్రమే వివాదాస్పదంగా మార్చి కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని స్పష్టం చేశారు. 

తను ఒక శాసనసభ్యుడునని అందరి సహకారంతోనే ఎమ్మెల్యేగా మారానని అన్నారు. పదేండ్లుగా నియంతృత్వ ధోరణి అవలంబించిన కల్వకుంట్ల కుటుంబం గురించి ఉద్దేశించి తాను మాట్లాడే తప్ప వెలమ సమాజంపై తనకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని క్లారిటీ ఇచ్చారు. 

ఒకవేళ తన వ్యాఖ్యలు తప్పుగా భావిస్తే తాను ఈ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు.