- కోవిడ్ నిబంధనలు తప్పనిసరి
- రోజూ 30వేల మంది భక్తులకు అనుమతి
శబరిమల: అయ్యప్ప ఆలయంలోకి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు 30 వేల మంది భక్తులకు దర్శనాలకు అనుమతిస్తున్నారు. కరోనా ప్రోటోకాల్ నిబందనలు పాటిస్తూ దర్శనాలకు అనుమతిస్తున్నారు. దర్శనానికి వచ్చ భక్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలి. అలాగే కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని నెగటివ్ రిపోర్టు వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది.
చాలా కాలంగా దర్శనాలకు నోచుకోని అయ్యప్ప భక్తులు భారీగా తరలివస్తుండడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దీక్ష ధారణ చేసిన వారిని దృష్టిలో పెట్టుకుని కరోనా నిబంధనల మేరకు దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల 26వ తేదీతో అయ్యప్ప మండల పూజ ముగియనున్న విషయం తెలిసిందే. మండల పూజ అనంతరం సంక్రాంతి సందర్భంగా మకరజ్యోతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల వస్తుంటారు. మకరజ్యోతి దర్శనాలు పూర్తైన తరువాత జరవరి 20 వ తేదీన ఆలయాన్ని మూసివేస్తారు.
