నీట్ పరీక్ష రద్దు చేయాల్సిందే

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: నీట్  పేపర్  లీకేజీపై విచారణ జరిపించడంతో పాటు పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ యూఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్.యూ నాయకులు డిమాండ్  చేశారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ పట్టణంలో వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే పేపర్  లీకేజీలు, నీట్ ర్యాంకుల ఆరోపణలు వచ్చాయని, వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్  చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయకుండా, గ్రేస్  మార్కులు పొందిన వారి స్కోర్  కార్డులు రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించమేమిటని ప్రశ్నించారు. ప్రశాంత్, భరత్,అవేశ్, రమేశ్,లక్ష్మణ్, రాజు, సీతారాం పాల్గొన్నారు.  

వనపర్తి టౌన్: నీట్  పేపర్  లీకేజీపై విచారణ జరిపించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం ఆది మాట్లడుతూ నీట్  లీకేజీపై కేంద్రం స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రాజస్థాన్, గుజరాత్  రాష్ట్రాల్లో లీకేజీ జరిగిందన్నారు. కుమార్, సాయి, చరణ్, ఈశ్వర్, మహేశ్,  శ్రీలత, మాధవి పాల్గొన్నారు.