ఆదివాసీ మహిళపై లైంగికదాడి.. అట్టుడుకుతోన్న ఆసిఫాబాద్

కొమురంభీం జిల్లా జైనూర్​ మండలానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళపై జరిగిన లైంగికదాడిని నిరసిస్తూ.. ఇవాళ పట్టణంలోని  సిర్పూర్​, జైనూర్​, లింగాపూర్ మండలాల నుంచి పెద్ద ఎత్తున్న ఆదివాసీలు ఆందోళనకు దిగారు. నిందితుడి ఇంటిని ధ్వసం చేశారు.  దీంతో జైనూర్​లో ఉద్రిక్తత నెలకొంది.

ఆందోళనకారులు మార్కెట్​లో తోపుడు బండ్లను నిప్పు అంటించారు. సామాగ్రిని రోడ్డుపై పడేశారు. డీఎస్పీ సదయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో స్పెషల్​ పార్టీ పోలీస్​టీమ్​లను రంగంలోకి దింపారు. వెంటనే నిందితుడిని అరెస్ట్​ చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.