వికారాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్కుమార్తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్సహకారంతో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వికారాబాద్నియోజకవర్గానికి చెందిన 105 మంది మహిళలకు బుధవారం ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఉచితంగా 105 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్గడ్డం ప్రసాద్కుమార్మాట్లాడుతూ..
కుట్టు మిషన్లతో ఇంటి వద్దే ఉపాధి పొందవచ్చన్నారు. టైలరింగ్కు డిమాండ్ ఉందని, శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు పని కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
