చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సీటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు.. రోడ్లన్ని నీటితో నిండిపోయాయి. రిజర్వాయర్లలోకి భారీగా నీరు చేరుతుండటంతో చెంబరంబాక్కం, రెడ్ హిల్స్ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. జనవరిలో రిజర్వాయర్ల గేట్లు ఎత్తడం చాలా అరుదన్న అధికారులు.. వర్షాలు భారీగా పడుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.
