రోడ్డుపై కనిపిస్తున్న ఇవేంటో తెలుసా.. వెలుగులోకి చీకటి దందా.. విషయం తెలిస్తే పాపం అనిపిస్తుంది..

దుబాయ్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగోళ్లు పడుతున్న కష్టాల గురించి వినే ఉంటారు. తాజాగా గల్ఫ్లో తెలుగు మహిళలతో బలవంతంగా చేయిస్తున్న ఒక చీకటి దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని, బాగా సంపాదించుకోవచ్చని కొందరు ఏజెంట్లు మహిళలకు మాయ మాటలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలను గల్ఫ్ దేశాలకు పంపించి మసాజ్ పార్లర్ల రొంపిలోకి బలవంతంగా దించుతున్నారు. ఇళ్లలో పనికి పెట్టిస్తామని చెప్పి తీరా అక్కడికి వెళ్లాక మగాళ్లకు మసాజ్ చేసే పని చేయిస్తున్నారు. 

ఈ మసాజ్ రాకెట్ నుంచి తప్పించుకున్న 40 ఏళ్ల మహిళ అబుదబిలోని ఇండియన్ ఎంబసీని ఆశ్రయించింది. ఈ మసాజ్ రాకెట్ గురించి విశాఖపట్నానికి చెందిన ఈ మహిళ చెప్పిన విషయాలు నిర్ఘాంతపోయేలా చేశాయి. బేబీ సిట్టర్ జాబ్ ఉందని తనను నమ్మించి దుబాయ్కు వచ్చాక తనతో మసాజ్ సెంటర్లో పురుషులకు మసాజ్ చేయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నెల రోజులు నరకం చూపించారని, నానా తిప్పలు పడి అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డానని చెప్పింది. 

విజిటింగ్ వీసాపై తనను తీసుకొచ్చారని, కొన్నాళ్లకు ఎంప్లాయిమెంట్ వీసా కిందకు మార్చుతామని మాటిచ్చారని తనను తీసుకొచ్చిన ఇద్దరు ఏజెంట్ల గురించి ఆమె చెప్పింది. ఆ మసాజ్ సెంటర్లలో చాలామంది హైదరాబాద్కు చెందిన మహిళలు కూడా మగ్గిపోతున్నారని ఈ మహిళ బయటపెట్టింది.

ప్రతీ వీకెండ్లో, హాలిడేస్ సమయంలో ఆ మసాజ్ సెంటర్ నిర్వాహకులు సదరు మహిళల ఫొటోలతో ఈ మహిళలతో మసాజ్ చేయించుకోవచ్చని వీధుల్లో పాంప్లేట్లు వెదజల్లుతారని బాధితురాలు తెలిపింది. ఆ పాంప్లేట్లలో టెలిఫోన్ నంబర్ ఇచ్చి ఈ సర్వీస్ కావాలంటే కాంటాక్ట్ అవ్వాలని ఉంటుందని ఆమె పేర్కొంది. వీకెండ్స్లో, హాలిడేస్ సమయంలో యూఏఈలో బిజీగా ఉండే రోడ్లపై నడవాలంటే ఎక్కడ తమ ఫొటో కుటుంబ సభ్యుల కంటపడుతుందోనని బిక్కుబిక్కుమంటూ కొందరు మహిళలు జీవనం సాగిస్తున్నారని బాధిత మహిళ చెప్పింది.