బ్రహ్మపుత్ర నదిలో రెండు బోట్లు ఢీకొని పలువురు గల్లంతు

బ్రహ్మపుత్ర నదిలో రెండు బోట్లు ఢీకొని పలువురు గల్లంతు

బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం జరిగింది. అస్సాంలోని జోర్హత్ నిమతి ఘాట్ దగ్గర రెండు బోట్లు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో రెండు బోట్లలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అసోం రాజధాని  గౌహతికి 350 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. ఒక బోట్ మజులి నుంచి నిమతి ఘాట్ కు వస్తుండగా.. మరో బోట్ ఎదురుగా రావడంతో రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బోట్ మునిగిపోయింది.

మునిగిపోతున్న బోట్ నుంచి పలువురు దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. బోట్ లోని మోటార్ బైకులు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న NDRF బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. ఇప్పటి వరకు 40 మందిని కాపాడారు. మిగిలిన వారికోసం గాలింపు కొనసోగుతోంది.

ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంతబిశ్వశర్మ స్పందించారు. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని మంత్రి బిమల్ బోరాను ఆదేశించారు. రేపు తాను ఘటనా స్థలిని సందర్శిస్తానని చెప్పారు. అన్ని సహాయక చర్యలను చేపట్టాలని మజులి, జోర్హత్ జిల్లాల అధికారులను ఆదేశించారు.