అప్పులు వసూలు కావట్లేదని ఫ్యామిలీ సూసైడ్

అప్పులు వసూలు కావట్లేదని ఫ్యామిలీ సూసైడ్
  • ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురి బలవన్మరణం
  • గుజరాత్​లోని సూరత్​లో దారుణం

సూరత్: అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వసూలు కావట్లేదనే టెన్షన్ తో ఓ కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లోని ముగ్గురు చిన్నపిల్లలకు విషం తాగించి కుటుంబ పెద్ద ఉరేసుకున్నాడు. సూరత్ లోని సిద్ధేశ్వర్ అపార్ట్ మెంట్ లో మనీశ్ సోలంకీ(37) కుటుంబం ఉంటోంది. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మనీశ్​తల్లిదండ్రులు కూడా ఆయనతో పాటే ఉంటున్నారు. ఈ క్రమంలో సోలంకీ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో పక్క ఫ్లాట్ వాళ్లు పోలీసులకు సమాచా రం అందించారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించగా.. లోపల చిన్నారులతో పాటు ముగ్గురు పెద్ద వాళ్లు నేలపై విగతజీవులుగా పడి ఉండడం కనిపించింది. ఆ పక్కనే మనీశ్ సోలంకీ డెడ్​ బాడీ ఫ్యాన్​కు వేలాడుతోంది. అక్కడున్న సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సోలంకీ ఫ్యామిలీ మరణాలకు కారణం ఆర్థిక ఇబ్బందులేనని చెప్పారు. ఇతరులకు అప్పిచ్చిన మొత్తం తిరిగి రాబట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు కాంట్రాక్టర్​గా పనిచేస్తున్న సోలంకి చివరిలేఖలో రాశారు.