చెంచుల ఆధార్ నమోదులో సర్వర్ తిప్పలు

అమ్రాబాద్, వెలుగు: చెంచులకు ఆధార్‌‌‌‌ నమోదులో సర్వర్‌‌‌‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆధార్‌‌‌‌ నమోదులో భాగంగా శుక్రవారం నిర్వహించిన రెండో రోజు క్యాంప్‌‌‌‌కు లింగాల, బల్మూర్‌‌‌‌కు చెందిన సుమారు 500 మంది చెంచులు తరలివచ్చారు. 101 మందికి బర్త్‌‌‌‌, 98 మందికి క్యాస్ట్‌‌‌‌ సర్టిఫికెట్లు జారీ చేయగా, 32 మందికి ఆధార్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేశారు. పదర, అమ్రాబాద్ మండల చెంచులకు శనివారం క్యాస్ట్‌‌‌‌, బర్త్‌‌‌‌, ఆయుష్మాన్‌‌‌‌భారత్‌‌‌‌, జన్‌‌‌‌ధన్‌‌‌‌ అకౌంట్లు నమోదు చేయనున్నారు. 

ఆయుష్మాన్‌‌‌‌ భారత్‌‌‌‌, మీ సేవ సర్వర్లలో సమస్యలు తలెత్తుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తామని ఐటీడీఏ పీవో రోహిత్‌‌‌‌ చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో మాధవి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.