హ్యాండ్ శానిటైజ‌ర్స్ వాడ‌కంతో తీవ్ర దుష్పరిణామాలు: ఎయిమ్స్

హ్యాండ్ శానిటైజ‌ర్స్ వాడ‌కంతో తీవ్ర దుష్పరిణామాలు: ఎయిమ్స్

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా  హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వీటిని అతిగా వాడటంతో భవిష్యత్తులో తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని ఎయిమ్స్‌  డాక్టర్లు హెచ్చరించారు. యాంటీమైక్రోబియల్‌ నిరోధకత సామర్థ్యం పెరిగి… వ్యాధికారక సూక్ష్మజీవులపై ఔషధాల ప్రభావం తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి మెడిసిన్స్ పని చేయక… ఏటా కోటి మంది ప్రమాదంలో పడతారని తెలిపింది. ఎయిమ్స్, అమెరికా సొసైటీ ఫర్‌ మైక్రోబయాలజీ… యాంటీబయోటిక్స్‌ నిరోధకతపై సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్‌లో పలు కీలక అంశాలను చర్చించారు. ఎయిమ్స్‌ మైక్రోబయాలజీ విభాగ అధిపతి డాక్టర్‌ రామచౌదరి ఈ వెబినార్‌కు అధ్యక్షత వహించారు. పెరుగుతున్న ఔషధ వినియోగాన్ని అదుపు చేయకపోతే… 2050 నాటికి ప్రతి ఏడాది కోటి మంది ప్రమాదంలో పడతారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతిగా వినియోగిస్తున్న హ్యాండ్‌ శానిటైజర్ల కారణంగా భవిష్యత్తులో పరిస్థితులు మరీ దారుణంగా మారుతాయన్నారు.