శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

రంగారెడ్డి: శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ ఆర్ పై తుఫాన్ వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. తుక్కు గూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.