అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం: ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం మాల్యనంతం పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ.. ఆటోను ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. రోడ్డు మీద చనిపోయిన ఇద్దరి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటనా స్థలంలో చనిపోయిన వారు తాడిమర్రి మండలానికి చెందిన భార్య భర్తలు సూర్య, ఆదెమ్మగా గుర్తించారు.

తాడిమర్రి మండలం పిన్నదరి నుంచి వీరు ఆటోలో వస్తుండగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో రోజూ బత్తలపల్లికి వచ్చి బొప్పాయి కాయలు అమ్ముకొని జీవనం సాగించే భార్య భర్తలు సూర్య, ఆదెమ్మ అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించడంలోఆలస్యం జరిగింది. 108 కి ఫోన్ చేసినా ఎంత సేపటికి రాకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్ లో పంపించగా ఫలింత లేకపోయింది.