శ్రీతేజ్‌‌‌‌‌‌‌‌ బ్రెయిన్‌‌‌‌‌‌‌‌లో తీవ్రమైన సమస్యలు: సీపీ సీవీ ఆనంద్

సికింద్రాబాద్, వెలుగు: పుప్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ (9)ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీపీ సీవీ ఆనంద్, హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టీనా పరామర్శించారు. మంగళవారం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని కిమ్స్ దవాఖానకు వచ్చి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. శ్రీతేజ్‌‌‌‌‌‌‌‌కు తొక్కిసలాటలోఊపిరి ఆడక బ్రెయిన్‌‌‌‌‌‌‌‌లో తీవ్రమైన సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. దీంతో బాలుడు రికవరీ కావడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నారన్నారు. హెల్త్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీక్రిస్టినా మాట్లాడుతూ.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మానిటరింగ్ చేస్తున్నామమని చెప్పారు.