హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని పలు చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. నానక్‌రాంగూడలోని తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగిలోని నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతోపాటు ఆయా చెరువుల్లోకి వరద చేరకుండా కాలువలను మళ్లించడం, మూసివేయడంపై నివేదిక సమర్పించాలని హైడ్రా అధికారులను ఆదేశించారు.
ALSO READ : రేవతి ఫ్యామిలీకి అల్లు అర్జున్ రూ.20 కోట్లివ్వాలి: ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం
నానక్‌రాంగూడలో చెరువుకు రెండు వైపులా ఉన్న వరదనీటి కాల్వలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలన్నారు. నార్సింగి దగ్గర మూసీ ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్మాణ సంస్థలు నదిలోకి పోసిన మట్టిని తొలగించాలని ఆదేశించారు. బఫర్ జోన్లో పోసే సంస్థలపై చర్యలుంటాయని హెచ్చరించారు.