మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ విమెన్స్ సింగిల్స్‌లో మరో సంచలనం. సెకండ్ సీడ్ అరినా సబాలెంక ప్రిక్వార్టర్స్‌లోనే ఓడింది. ఆమెతో పాటు స్టార్ ప్లేయర్ సిమోనా హలెప్ కూడా నిరాశ పరిచింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో కనెపి (ఇస్తోనియా) 5-–-7, 6–--2, 7–--6 (10/7)తో సబలెంక (బెలారస్)కు షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో14వ సీడ్ హలెప్ (జర్మనీ) 4-–6, 6–-3, 4–-6తో కార్నెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్‌ల్లో కొలిన్స్ (అమెరికా) 4–-6, 6–-4, 6–-4తో మార్టెన్స్ (బెల్జియం)పై, స్వైటెక్ (పోలెండ్) 5–-7, 6–-3, 6–-3తో క్రిస్టియా (రొమేనియా)పై గెలిచి క్వార్టర్స్ చేరారు.
ఇక, మెన్స్ సింగిల్స్‌లో యూఎస్ ఓపెన్ చాంప్, రష్యా స్టార్ మెద్వెదెవ్ క్వార్టర్స్‌లో అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో సెకండ్ సీడ్ మెద్వెదెవ్ 6–2, 7–6 (7/4), 6–7 (4/7), 7–5తో క్రెసీ (అమెరికా)పై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ సినర్ (ఇటలీ) 7–6 (7/3), 6–3, 6–4తో డి మినార్ (ఆస్ట్రేలియా)పై, సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–4, 4–6, 6–3, 6–4తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై విజయం సాధించారు.
