అడ్వొకేట్ సంచలన వ్యాఖ్యలు.. మూడు రోజుల్లో అల్లు అర్జున్ బెయిల్ రద్దు

హైదరాబాద్:  తెలంగాణలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ వారం రోజుల్లోనే బీఆర్ఎస్, బీజేపీలు తాము అనుకున్న పనిని చేయాలను కుంటున్నాయని తెలిపారు. సినీ హీరో అల్లు అర్జున్ వెనుక  శక్తి ఉందన్నారు. రెండు, మూడ్రోజుల్లో ఆయన బెయిల్ రద్దు అవుతుందని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ పక్షాన నిలబడిన వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొంటానని ప్రకటించారు.

 సంధ్య థియేటర్ ఘటనలో దాదాపు 4 గంటల పాటు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పీఎస్ లో  పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.  డిసెంబర్ 21న రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పైనే పోలీసులు  ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. దాదాపు 20  ప్రశ్నలకు అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు.  విచారణలో అల్లు అర్జున్ చాలా ప్రశ్నలకు మౌనంగా ఉన్నారు. కొన్ని ప్రశ్నలకు తెల్వదని చెప్పినట్లు తెలుస్తోంది

Also Read :- శ్రీతేజ్ కోలుకుంటున్నాడు.. కేసు వాపస్ తీసుకుంటా

డిసెంబర్ 4న రాత్రి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా..మరొకరికి గాయాలైన సంగతి తెలిసిందే .   ఈ కేసులో  అల్లు అర్జున్ ను  ఏ11 గా చేర్చిన పోలీసులు.. ఏ 18గా పుష్ఫ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతను చేర్చారు. ఏ1 నుంచి   ఏ8 వరకు థియేటర్ యజమానులు, మేనజర్ ను చేర్చారు. ఏ9 ,ఏ 10 గా  సంధ్య థియేటర్  సెక్యూరిటీ, మేనేజర్ ను చేర్చారు. ఏ 11 నుంచి ఏ 17 వరకు అల్లు అర్జున్, బౌన్సర్, సెక్యూరిటీ పేర్లను చేర్చారు.