కార్యకర్త కుటుంబానికి సీఎం పరామర్శ

  • అధైర్య పడొద్దు.. అండగా ఉంటా 

మద్దూరు, వెలుగు: మద్దూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ సతీశ్ ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబీకులను సీఎం రేవంత్ రెడ్డి శనివారం పరామర్శించారు.  తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో  కలిసి కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చారు. 

కార్యక్రమంలో నారాయణ పేట జిల్లా ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రఘు పతి రెడ్డి, మాజీ ఎంపీపీ విజయలక్ష్మి సంజీవ్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింలు,లీడర్లు జనార్దన్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.