కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నెలలో కరోనా పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో గుర్గావ్ లోని ప్రముఖ మేదాంత ఆస్పత్రిలో చేరి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) ఆరోగ్యం విషమంగా మారడంతో ఐసీయూలోకి తరలించారు. అక్టోబర్ 1 నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని డాక్టర్లు తెలిపారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని చెప్పారు. మరోవైపు అహ్మద్ పటేల్ ఆరోగ్యంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
