స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి :సివిల్ జడ్జి గంటా కవితా దేవి

గద్వాల, వెలుగు: గద్వాల పట్టణంలోని అర్బన్  రెసిడెన్షియల్  స్కూల్ స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ప్రిన్సిపల్  సీనియర్  సివిల్  జడ్జి గంటా కవితా దేవి తెలిపారు. బుధవారం స్కూల్​ను సందర్శించి స్టూడెంట్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్లాస్  రూమ్స్  కొరత ఉందని, పడుకోడానికి ఇబ్బంది పడుతున్నాయని, టీచర్ల కొరత ఉందని స్టూడెంట్లు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.

సమస్యలు ఉన్నాయనే విషయం తెలిసి తాను ఇక్కడికి వచ్చానని, ఈ విషయాన్ని సంబంధిత ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. హెచ్ఎం శేషన్న పాల్గొన్నారు.