హిమాచల్ ప్రదేశ్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినంత మాత్రాన లైంగిక సంబంధం పెట్టుకోవడానికి,వేధించడానికి అనుమతిచ్చినట్టు కాదని తీర్పునిచ్చింది. 2019 నవంబర్‌లో మైనర్ బాలికపై రేప్ కేసులో నిందితుడి బెయిల్ పై విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. బాధితురాలే నిందితుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిందని..మైనర్ తన ఏజ్ గురించి తప్పుగా చెప్పిందని నిందితుడి తరపు న్యాయవాది వాదించాడు.దీనిపై స్పందించిన జస్టిస్ అనూప్ చిట్కర…సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే అది.. లైంగిక సంబంధానికి అనుమతి కాదని చెబుతూ.. నిందితుడి బెయిల్ పిటిషన్ ను కొట్టేశారు. ఈ రోజుల్లో సోషల్ మీడియాను యూజ్ చేయడం ..వారి వివరాలు సీక్రెట్ గా పెట్టుకోవడం సాధారణమన్నారు. కేవలం తమ పరిధిని పెంచుకోవడానికి నాలెడ్జ్ ను పెంచుకోవడానికి గానీ, లైంగిక , మానసిక వేధింపులకు గురిచేయడానికి కాదని సూచించారు.
see more news
