సెమీకాన్​ ఇండియా సమ్మిట్​-2024.. భారత్​లో రూ.లక్షన్నర కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు

ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్​పో మార్ట్​లో మూడు రోజులపాటు సెమికాన్​ ఇండియా 2024 సమ్మిట్​ జరిగింది. ఈ సమ్మిట్​ థీమ్​ షేపింగ్​ ది సెమీకండక్టర్ ఫ్యూచర్​. సెమీకండక్టర్​ మాన్యుఫాక్చరింగ్​ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో బాసటగా నిలుస్తున్నది. భారత్​ అనుసరిస్తున్న విధానాలతో భారత్​లో రూ.లక్షన్నర కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు వచ్చాయి.

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్​ రంగ మార్కెట్​ విలువ 150 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. దీన్ని మరింత పెంచాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. చిప్​ల డిజూన్​లో గ్లోబల్​ టాలెంట్​లో భారత వాటా 20 శాతంగా ఉంది. సంస్కరణవాద ప్రభుత్వం, పెరుగుతున్న తయారీ స్థావరం, సాంకేతికత దేశంలో దేశంలో చిప్ తయారీకి త్రీ–డి పవర్​ను భారతదేశం అందజేస్తున్నది. గ్లోబల్ సెమీకండక్టర్​ ఇనీషియేటివ్​ను ప్రపంచంలో ప్రారంభించిన ఎనిమిదో దేశంగా భారత్​ నిలిచింది.