మీ భూమి మాకు అమ్మండి లేకుంటే చంపేస్తాం..బౌరంపేట్లో రైతులపై దాడి

కుత్బుల్లాపూర్: మేం భూమిని అమ్మం.. అని ఎంత చెప్పినా వినకుండా మీ వ్యవసాయ భూమిని మాకే అమ్మాలి..లేకుంటే చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని బౌరంపేట్ గ్రామ రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అర్థరాత్రి వ్యవసాయ భూమిలోకి ప్రవేశించి ప్రీ క్యాస్ట్ ధ్వంసం చేసి ఆక్రమించుకునేందుకు యత్నిస్తు న్నారని వాపోయారు. రక్షణ కల్పించాలని దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బౌరంపేట్ గ్రామ రైతులు. 

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరం పెట్ లోనీ  కృష్ణా రెడ్డి, కంసమ్మా  అనే రైతులకు  సర్వే నం.188,187,189లో గల 2ఎకరాల 32 గుంటల  స్థలంఉంది. ఈ స్థలం విషయంలో త్రిపుర భవన నిర్మాణ సంస్థకు , రైతులకు మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఇటీవల రైతులకు మద్దతుగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ను కూడా బేఖాతరు చేయకుండా త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థకు చెందిన కొందరు దౌర్జన్యంగా కంసమ్మ భూమిలో ప్రవేశించి హద్దులు చెరిపారాని ఆవేదన వ్యక్తం చేసింది.పలుకుబడి ఉపయోగించి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, భూమిని అమ్మక పోతే చంపుతామని రోజు ఇంటికి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.

త్రిపుర భవన నిర్మాణ సంస్థతో కలిసి మేకల వెంకటేష్ అనే  స్థానిక బీఆర్ ఎస్ నాయకులు భూమి అమ్మాలని వొత్తిడి తెస్తున్నానరని తెలిపారు.రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించగా వారి పై పలు సెక్షన్ ల కింద కేసులు సైతం నమోదు చేశారు. అయినా రోజు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని తెలిపారు బాధితులు. ఈ విషయం లో ప్రభుత్వ అధికారులు చొరవ చూపించి  తమ ప్రాణాలను,భూమిని కాపాడాలని లేని యెడల సిఎం కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని అవేదన వ్యక్తం చేశారు.