- డీల్ విలువ రూ.340 కోట్లు
హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సయంట్ పోర్చుగల్‌కు చెందిన వైర్లెస్ ఇంజనీరింగ్ సర్వీస్ ఫర్మ్ సెల్ఫీనెట్ను చేజిక్కించుకోనుంది. ఈ క్యాష్ డీల్ విలువ 41 మిలియన్ యూరోలని (దాదాపు రూ.340 కోట్లు) కంపెనీ వెల్లడించింది. దీనివల్ల వైర్లెస్ ఇంజనీరింగ్ సెగ్మెంట్బలోపేతమవుతుందని, కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు మరింత మెరుగ్గా సేవలను అందించవచ్చని సయంట్ తెలిపింది. ఎంటర్ప్రైజ్లకు నెట్వర్క్ సదుపాయాన్ని సమకూర్చవచ్చని పేర్కొంది. ఈ డీల్ప్రకారం సయంట్ సెల్ఫీనెట్కు ముందుగా 65 శాతం డబ్బును చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని రెండేళ్లలో సర్దుబాటు చేస్తుంది. కొనుగోలు పనులు ఈ నెల 20లోపు పూర్తవుతాయి. సెల్ఫీనెట్ తమ చేతికి రావడం వల్ల తమ 5జీ టెక్నాలజీలు మరింత మెరుగవుతాయని సయంట్ ఎండీ, సీఈఓ బోదనపు కృష్ణ చెప్పారు. పోర్చుగల్‌లో ట్యాలెంట్‌కు కొరత లేదు కాబట్టి స్ట్రాటెజిక్ ఇనోవేషన్ హబ్ అవుతుందని వివరించారు. ఇక నుంచి యూరప్ దేశాల్లో తమకు మరిన్ని వ్యాపార అవకాశాలు వస్తాయని, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాలో వ్యాపారం పెరుగుతుందని కృష్ణ చెప్పారు.
