ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు భారీగా సైనైడ్ పట్టుకున్నారు. ముంబై కార్గో ద్వారా దుబాయి వెళుతున్న ఓ పార్సిల్‌లో రూ.32 కోట్ల విలువ చేసే గోల్డ్ పొటాషియం సైనైడ్‌ను గుర్తించినట్లు DRI అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులనుంచి తప్పించుకోడానికి బురడి కొట్టించడానికి సైనైడ్‌ను కార్గో ద్వారా దుబాయికి తరలించే యత్నం చేశారని చెప్పారు. విశ్వసనీయ సమాచారంతో ముంబై ఎయిర్‌పోర్ట్ కార్గోలో పార్సల్‌పై నిఘా పెట్టామని.. ఓ పార్సిల్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేశామని తెలిపారు అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
