హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్‌షిప్ ఎనిమిదో ఎడిషన్ పోటీల్లో టాప్ సీడెడ్ సెయిలర్లు సత్తా చాటుతున్నారు. రెండో రోజు, శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన గోవర్ధన్ పల్లార సబ్ జూనియర్ ఓవరాల్ ఆప్టిమిస్ట్ కేటగిరీలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇదే విభాగంలో హైదరాబాద్ సెయిలర్ దీక్షిత కొమరవెల్లి రెండు రేసుల్లో గెలిచి, మరో రెండింటిలో నిరాశ పరిచింది. మొత్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆమె సోదరి లాహిరి కొమరవెల్లి మూడో స్థానంలో ఉంది. జూనియర్ లేజర్ ఫ్లీట్‌లో నల్గొండకు చెందిన శ్రవణ్ కత్రావత్ కూడా ఒక రేసు మినహా అన్నింటినీ గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. గర్ల్స్ కేటగిరీలో టాప్ సీడ్ మాన్య రెడ్డి టాప్ ప్లేస్‌లో నిలిచింది.