ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో ఆదివారం బస్తీవాసులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా తొట్టెల ఊరేగింపుతో పాటు ఫలహార బండి ఉరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు.

ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి,  రాజ్యసభ సభ్యుడు అనిల్​ కుమార్, ఎమ్మెల్సీ కవిత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు, కార్పొరేటర్ కొంతం దీపిక పాల్గొన్నారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ ఉన్నా మజ్లిస్, ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.