ఉత్తర ప్రదేశ్ హత్రాస్ జిల్లాలో సామూహిక హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా పలు పార్టీలు ఇవాళ(శుక్రవారం) దేశ రాజధానిలో ధర్నాలకు పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో 114 సెక్షన్ విధించారు. 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరికైనా ఎలాంటి నిరసనలకైనా అనుమతులు ఉంటే ఇండియా గేట్‌కు 3 కి.మీ. దూరంలోని జంతర్‌మంతర్ దగ్గర నిర్వహించుకోవాలని… వంద మందికంటే ఎక్కువ మంది గుమికూడడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. ఇండియాగేట్ పరిసరాల్లో ఎట్టిపరిస్థితుల్లో ఒకే దగ్గర గుంపులు గుంపులుగా ఉండకూడదని… అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిషేదాజ్ఞలు రేపటి వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
