విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో..సౌతాఫ్రికాకు రెండో విజయం

దుబాయ్‌‌‌‌ : ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న సౌతాఫ్రికా.. విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన గ్రూప్‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌లో 80 రన్స్‌‌‌‌ తేడాతో స్కాట్లాండ్‌‌‌‌పై గెలిచింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌ల్లో 4 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు చేరుకుంది. టాస్‌‌‌‌ నెగ్గిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 166/5  స్కోరు చేసింది. తజ్మిన్‌‌‌‌ బ్రిట్స్‌‌‌‌ (43), మారిజానె కాప్‌‌‌‌ (43), లారా వోల్‌‌‌‌వర్త్‌‌‌‌ (40) రాణించారు. 

తర్వాత స్కాట్లాండ్‌‌‌‌ 17.5 ఓవర్లలో 86 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. క్యాథరిన్‌‌‌‌ ఫ్రేజర్‌‌‌‌ (14), ఐల్సా లిస్టర్‌‌‌‌ (12)తో సహా అందరూ ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌‌‌‌ మొత్తంలో 9 మంది సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌ స్కోరుకే పరిమితమయ్యారు. మలాబా 3 వికెట్లు తీసింది. కాప్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.