ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ

కృష్ణానదికి వరద నీటి ఉధృతి పెరుగుతుండడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6లక్షల క్యుసెక్కులుగా ఉంది. మరోవైపు వంశధారనదికి వరద ఉధృతి పెరగడంతో… గొట్టా బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇన్ ఫ్లో 81,354 క్యుసెక్కులు,అవుట్ ఫ్లో 68,632 6 క్యుసెక్కులుగా ఉంది. వరద ఉధృతి దృష్ట్యా అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. సహాయక బృందాలకు సహకరించాలని విపత్తుల శాఖ కమిషనర్ విజ్ఞప్తి చేసింది. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపింది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.