గాంజా స్మగ్లర్లతో లింక్స్.. ఇద్దరు SIలు, ఓ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తులతో సంబంధాలు ఉన్న ఇద్దురు ఎస్ఐలు, ఓ హెడ్ కానిస్టేబుల్ పై రెండవ మల్టీ జోన్-  IG V.సత్యనారాయణ యాక్షన్ తీసుకున్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని చిరాగ్‌పల్లి, BDL భానూర్ పోలీస్ స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మల్లుగొండ మల్లేష్ నాయక్, లకాస్ లను తీసుకొచ్చి విచారించారు. నేరస్థులు గతంలో కూడా గంజాయి రవాణా చేస్తున్నారని తెలిసి జిల్లా ఎస్పీ రూపేష్ లోతుగా ఎక్వైరీ చేయించారు. 

ప్రస్తుతం పటాన్ చెరు పీఎస్ ఎస్సై గా పనిచేసిన అంబారియా, వీఆర్ సంగారెడ్డికి బదిలీ అయిన ఎస్ఐ వినయ్ కుమార్, సీసీఎస్ సంగారెడ్డిలో హెడ్ కానిస్టేబుల్ శ్రీ వి మారుతి నాయక్, మనూర్ పీఎస్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీ మధు లు గంజాయి స్మగ్లింగ్ తో సంబంధం ఉన్నట్లు తేలింది. వెంటనే వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.