దసరా,దీపావళి స్పెషల్.. 771 ప్రత్యేక రైళ్లు

దసరా,దీపావళి స్పెషల్.. 771  ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్, వెలుగు: దసరా, దీపావళి, ఛత్ పూజ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) 771 ప్రత్యేక రైళ్లను నడపనుంది. వివిధ మార్గాల్లో అక్టోబర్ 30 వరకు వీటిని నడపనున్నట్టు అధికారులు తెలిపారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, నాగర్ సోల్, మాల్దా టౌన్, గోరక్ పూర్, దానాపూర్, రక్సాల్, నిజాముద్దీన్, బెర్హంపూర్, హౌరా మొదలైన మార్గాల్లో ఈ రైళ్లను నడపడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 

దసరా, దీపావళి సందర్భంగా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ గమ్య స్థానాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో రద్దీని తట్టుకోవడానికి ఎస్సీఆర్ అధికారులు ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.